జీతాల కోసం మెస్‌ కార్మికుల ధర్నా

జీతాల కోసం

ప్రజాశక్తి-కాకినాడమెస్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు ఆందోళనలో భాగంగా కాకినాడ జిజిహెచ్‌ తల్లీ బిడ్డ విగ్రహం వద్ద కార్మికులు శనివారం ధర్నా చేశారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, మెస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు వై.శంకర్‌, ఎ.ఏడుకొండలు మాట్లాడారు. 30 ఏళ్ల నుంచి కాకినాడ జిజిహెచ్‌లో రోగులకు ఆహార అందించడంలో మెస్‌ కార్మికులు ఎంతో శ్రమ పడుతున్నారని, అటువంటి కార్మికులకు రెండు నెలల కాలం నుంచి కాంట్రాక్టర్‌ జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పారు. ఎనిమిది నెలల కాలం నుంచి కార్మికుల పిఎఫ్‌ వాటా రూ.7 లక్షల వరకు సొమ్ము కట్‌ చేసుకుని పిఎఫ్‌ ఖాతాకు జమ చేయకుండా కాంట్రాక్టర్‌ వద్ద పెట్టుకు న్నారన్నారు. ఈ కాంట్రాక్టర్‌ కాలపరిమితి 2024 ఏప్రిల్‌ నెలతో ముగియనుందని, సొమ్ము పిఎఫ్‌ ఖాతాకు జమ చేయకపోతే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి అన్నారు. ఈ కార్యక్రమంలో వై.శ్రీను, ఎస్‌.శ్రీను, సురేష్‌, విజరు, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

➡️