జీరో ప్రమాదాలు అభినందనీయం: మైన్స్‌ సేఫ్టీ డైరెక్టర్‌

జీరో ప్రమాదాలు అభినందనీయం: మైన్స్‌ సేఫ్టీ డైరెక్టర్‌ప్రజాశక్తి-చీమకుర్తి చీమకుర్తి ప్రాంత గెలాక్సీ గనులలో గత ఏడాదిగా జీరో ప్రమాదాలు నమోదు కావడం అభినందనీయమని మైన్స్‌ సేఫ్టీ డైరెక్టర్‌ సుప్రియా చక్రవర్తి పేర్కొన్నారు. సోమవారం చీమకుర్తి ప్రాంత గనులలో సేఫ్టీ వీక్‌ తనిఖీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు గ్రానైట్‌ గనులలో ఆయన విస్తృతంగా పర్యటిం చారు. యాపిల్‌ గ్రానైట్‌ గనిలో జరిగిన తనిఖీలో ఆయన కార్మికులచే సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు. ఆయనకు యాపిల్‌ గని యజ మాని, సేఫ్టీ వీక్‌ హోస్ట్‌ శిద్దా సూర్యప్రకాశరావు, కమిటీ కోశాధికారి శిద్దా పవన్‌కుమార్‌ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం రామతీర్థంలోని విటిసిలో గ్రానైట్‌ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఉత్పత్తి, భద్రత రెండూ అవసర మని, యజమానులు గని పనిలో అవసరాలు గుర్తించాలని అన్నారు. జీరో ప్రమాదాలు లక్ష్యంగా యజమానులు పని చేయాలని సూచించారు. భద్రత నిరంతరం సాగేలా చర్యలు కొనసాగించాలన్నారు. అనంతరం డైరెక్టర్‌ సుప్రియా చక్రవర్తిని సేఫ్టీ వీక్‌ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యాపిల్‌ గ్రానైట్‌ అధినేత శిద్దా సూర్యప్రకాశరావు, ప్రతినిధి శిద్దా పవన్‌కుమార్‌, ఒంగోలు గెలాక్సీ అధినేత చలువాది బదరీ నారాయణ, పల్లవ గ్రానైట్‌ అధినేత కె సుబ్బారెడ్డి, షాహీన్‌ గ్రానైట్‌ అధినేత అజీమ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ గ్రానైట్‌ అధినేత ఆర్‌పి రవి, జివిటిసి ప్రధాన కార్యదర్శి సుభాస్కరరెడ్డి, గోల్డెన్‌ గ్రానైట్‌ మేనేజర్‌ ఏ గిరిబాబు, పొకర్ణ గ్రానైట్‌ జిఎం సుబ్బారావు, హంసా గ్రానైట్‌ చంద్రారెడ్డి, సదరన్‌ గ్రానైట్‌ జయరామిరెడ్డి, జయ మినరల్స్‌ ప్రసాదు, ఫణికుమార్‌ పాల్గొన్నారు.

➡️