జెఎన్‌టియులో జాతీయ సెమినార్‌

Feb 28,2024 21:38

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : జెఎన్‌టియు గురజాడ విజయనగరం ప్రాంగణంలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సాంకేతిక సింపోజియం ఘనంగా బుధవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా జెఎన్‌టియు వైస్‌ ఛాన్సలర్‌ కె.వి వెంకట సుబ్బయ్య పాల్గొని మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం ద్వారా భవిష్యత్‌లో మన అభివృద్ధితో పాటూ దేశాభివృద్ధి సాధ్యపడుతుందని పేరొన్నారు. ఈడియక్స్‌ వంటి ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా సిలబస్‌ ు దాటి వివిధ అదనపు పాఠ్యాంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని సూచించారు. దీనికి సంబంధించి యూనివర్శిటీ తరుపున ఆయన పూర్తి సహాయసహకారాలను అందిస్తామన్నారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సాంఖ్యా టెక్నాలజి సిఇఒ గోపి కుమార్‌ బులుసు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు పెద్ద సంఖ్యల్లో రోజువారి సమస్యలను పరిష్కరిస్తాయని అన్నారు. ఈ సంధర్భంగా సాంఖ్య టెక్నాలజీస్‌ రూపొందించిన డిజిటల్‌ బ్యాగ్‌ను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.శ్రీకుమార్‌, ఇసిఇ డిపార్టుమెంట్‌ హెడ్‌ బి.నలిని, తదితరులు పాల్గొన్నారు.

➡️