జెవివి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

Feb 12,2024 21:36
ఫొటో : మాట్లాడుతున్న జెవివి గౌరవాధ్యక్షులు డాక్టర్‌ బెజవాడ.రవికుమార్‌

ఫొటో : మాట్లాడుతున్న జెవివి గౌరవాధ్యక్షులు డాక్టర్‌ బెజవాడ.రవికుమార్‌
జెవివి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
ప్రజాశక్తి-కావలి : ఫిబ్రవరి 28న జరిగే ‘సైన్స్‌ దినోత్సవం సందర్భంగా’ సోమవారం జెవివి గౌరవాధ్యక్షులు డాక్టర్‌ బెజవాడ.రవికుమార్‌ వ్యాసరచన పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తరతరాల నుండి సమాజ ప్రగతికి శాస్త్రవిజ్ఞానం ఎంత ఉపయోగపడుతుందో.. రేపటి పౌరులైన నేటి విద్యార్థులకు తెలియజేయాలని, ఉత్తమ పౌరసమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో జనవిజ్ఞానవేదిక సైన్స్‌ దినోత్సవ వారోత్సవాలను నిర్వహిస్తుందన్నారు. వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు నుండి కావలి విశ్వోదయ బాలుర పాఠశాల ప్రాంగణంలో ”వైజ్ఞానిక బస్సుయాత్ర” వస్తుందని తెలిపారు. కళాబృందాలు శాస్త్రీయ రూపకాలు, నృత్యాలు, నాటికల ద్వారా ప్రజలలో శాస్త్రీయ దృక్పథం అలవడేలా సాంస్కృతిక కార్యక్రమం ఉంటుందన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలందరూ ”ఈ సైన్స్‌జాతాలో పాల్గొనాలని జెవివి ఆహ్వానిస్తుందన్నారు. ఉపాధ్యక్షురాలు సి.శారద మాట్లాడుతూ సోమవారం జరిగిన వ్యాసరచన పోటీలో 20 పాఠశాలల నుండి దాదాపు 100మంది 6, 7 తరగతుల జూనియర్లు – 8, 9, 10 తరగతుల నుండి సీనియర్లు పాల్గొన్నారన్నారు. జూనియర్లకు ” శాస్త్రవిజ్ఞానం – మానవ ఆరోగ్యం ” ( సీనియర్లకు ” శాస్త్రవిజ్ఞానం – సమాజం ” అనే అంశాలపై వ్యాసాలు రాశారన్నారు. జెవివి ఉపాధ్యక్షులు సి.కల్లయ్య, కోశాధికారి టి.సుబ్బరాయశర్మ, ప్రధాన కార్యదర్శి జి.హరనాథ్‌, కార్యవర్గ సభ్యులు జాన్‌ వ్యాసరచన పోటీ నిర్వహణలో బాధ్యత్వహించారు. 13, -14, తేదీల్లో వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు ఉదయం 9.30కు ఖచ్చితంగా ప్రారంభమవుతాయని ఉత్సాహంగా విద్యార్థులను ప్రోత్సహించి పంపాలని కార్యదర్శి గాదిరెడ్డి హరినాధ్‌ కోరారు. పాఠశాలలన్నింటికీ పోటీల వివరాలను పంపించామని తెలిపారు. ఆ వివరాల ప్రకారం, సందేశాత్మక పాటల పోటీ, సందేశాత్మక నృత్యపోటీలు, 21వ తేదీ సైన్స్‌ ప్రదర్శనలకు విరివిగా విద్యార్థులు పాల్గొని శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని బాధ్యులు కోరారు.

➡️