జెవివి చెకుముఖి పోటీలు

Jan 7,2024 21:59
ఫొటో : విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్న జెవివి నాయకులు

ఫొటో : విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్న జెవివి నాయకులు
జెవివి చెకుముఖి పోటీలు
ప్రజాశక్తి-కావలి : పట్టణంలోని విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా చెకుముకి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్‌ బెజవాడ. రవికుమార్‌ జిల్లాస్థాయి చెకుముకి టాలెంట్‌ ప్రశ్నాపత్రాలను, టి.వి.ఎస్‌. మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ క్యాలెండర్స్‌ను కూడా ఆవిష్కరణ చేశారు. గత డిసెంబర్‌ 21, 2023 మండల/పట్టణ స్థాయిలో జరిగిన పోటీ పరీక్షల్లో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా స్థాయిలో చెకుముకి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా నుండి 37 టీములు అనగా 111మంది విద్యార్థులు పాల్గొన్నారు. రెండు టీములు రాష్ట్ర స్థాయికి సెలెక్ట్‌ అయిన విజేతలకు దాతలు పసుపులేటి.సుధాకర్‌, వారి భార్య పసుపులేటి.సుగుణమ్మలు మెమొంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమం నిర్వాణకు భారీ విరాళం అందించిన పసుపులేటి సుధాకర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పసుపులేటి సుధాకర్‌ – పసుపులేటి.సుగుణమ్మ దంపతులకు జిల్లా జన విజ్ఞాన వేదిక తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా జెవివి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉదయ భాస్కర్‌, కృష్ణారెడ్డి, ముఖ్య అతిథి డాక్టర్‌ కె.సుబ్బారావు, కావలి పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోట.వెంకటేశ్వర్లు, గాదిరెడ్డి.హరినాథ్‌, గౌరవా ధ్యక్షులు డాక్టర బెజవాడ రవికుమార్‌, కోశాధికారి టి.సుబ్బారామశర్మ, షేక్‌.ఖాదర్‌ బాషా, జి.కళ్యాణి, ఎస్‌.రమణయ్య, స్వర్ణలత, గాదిరెడ్డి మురళి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

➡️