టిడిపితోనే పేదలకు అండ : స్వామి

ప్రజాశక్తి-శింగరాయకొండ : టిడిపితోనే పేదల అండ అని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. శింగరాయకొండ పంచాయతీ పరిధిలోని దేవరపల్లి రాఘవయ్య కాలనీలో బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వేల్పుల సింగయ్య, చీమకుర్తి కష్ణ, కూనపురెడ్డి వెంకట సుబ్బారావు, షేక్‌ సందాని బాషా, షేక్‌ అబ్దుల్‌, సుబహాన్‌, సుదర్శి ప్రసాదరావు, షేక్‌ యస్‌ధాని, వేల్పుల సురేష్‌, వెంకటేష్‌ చౌదరి, శీలం సుబ్రహ్మణ్యం చిగురుపాటి శేషగిరి, కనిగిరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️