టిడిపితోనే ప్రజలకు రక్షణ

Feb 21,2024 20:56

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ప్రజలకు రక్షణ టిడిపితోనే అని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి.అదితి గజపతి అన్నారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బుధవారం 45వ డివిజన్‌ కె.ఎల్‌.పురం లో కొండ వీధి, మొండివీధి, బ్రాహ్మణ వీధి, రెవిన్యూ కోలనీ, బ్యాంకు కాలనీలో టిడిపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు, రాష్ట్రం అభివద్ధి చెందాలంటే తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఎన్‌టిఆర్‌ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే, చంద్రబాబు నాయుడు మహిళా అభ్యున్నతి కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ఆత్మవిశ్వాసాన్ని నింపారని అన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఎక్కడ చూసినా విధ్వంసం, అరాచకాలు, రౌడీయిజం రాజ్యమేలు తున్నాయని అన్నారు. అరాచక, అప్రజాస్వామిక పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు కార్యదర్శి గంటా పోలినాయుడు రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జర్నలిస్టుల పై దాడి అప్రజాస్వామికం

జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామికమని అదితి గజపతిరాజు అన్నారు. టిడిపి కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రజలపై అనేక రూపాల్లో దాడులు చేస్తోందన్నారు. తాజాగా మరింత బరి తెగించి మీడియాపై దాడులలు చేయడం హేయమైన చర్యని అన్నారు

➡️