మహిళపై హత్యాచారం, హత్య

Jun 28,2024 22:40 #Femicide, #Murder

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా ఎస్‌పి మల్లికాగర్గ్‌ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒప్పిచర్లలో గండికోట విజయలక్ష్మి అనధికారికంగా మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన రమావత్‌ బాబు నాయక్‌, బాణావత్‌ బాలూనాయర్‌ అనే ఇద్దరు వ్యక్తులు విజయలక్ష్మి వద్ద మద్యం కొనుగోలు చేస్తుండేవారు. అయితే ఎప్పటిలాగా బుధవారం రాత్రి మద్యం కొనుగోలు చేసేందుకు వారిద్దరూ విజయలక్ష్మి వద్దకు వెళ్లారు. మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడం, గతంలో ఉన్న బకాయిల గురించి వారి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో ఆమెపై దాడి చేశారు. అనంతరం అత్యాచారం చేసి కర్రతో దాడిచేసి హత్య చేశారు. మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరు నింధితులను గుర్తించి అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌పి తెలిపారు. ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన వివాదం అత్యాచారం, హత్యకు దారితీశాయన్నారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్‌పి తెలిపారు.

➡️