టిడిపితోనే బీసీలకు రక్షణ : బాలాజీ

ప్రజాశక్తి-పెద్దారవీడు : మండల పరిధిలోని దేవరాజుగట్టు గ్రామంలో గుమ్మా గంగరాజు అధ్యక్షతన జయహో బీసీ గర్జన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడూరి ఎరీక్షన్‌బాబు మాట్లాడారు. బీసీలను ఆదరించింది టిడిపినేనని తెలిపారు. బీసీలకు టిడిపి ప్రభుత్వంలోనే న్యాయం జరిగినట్లు తెలిపారు. అనంతరం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదినం సందర్భంగా భారీ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు గొట్టం శ్రీనివాసరెడ్డి, బీసీ సంఘ నాయకులు కన్నెబోయిన సుబ్బయ్య, నక్కా శ్రీను, తోకల యల్లయ్య, గుమ్మా బుజ్జి, పెద్దారవీడు మండల టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️