టిడిపిలో చేరికలు

Feb 12,2024 21:38
ఫొటో : కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కావ్య క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వైసిపి నాయకులు

ఫొటో : కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కావ్య క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వైసిపి నాయకులు
టిడిపిలో చేరికలు
ప్రజాశక్తి-కావలి : కావలి మండలం అన్నగారి పాలెం పంచాయతీ పూలదరువు గ్రామానికి చెందిన పలు కుటుంబాలు, కావలి పట్టణ టిడిపి కార్యాలయంలో సోమవారం వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి టిడిపి మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కావలి టిడిపి ఇన్‌ఛార్జి కావ్య క్రిష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ మాజీ వార్డుమెంబర్‌ కాకి పుష్పమ్మ, గ్రామపెద్ద అరగల సీనయ్య, కాకి నాగేశ్వరరావు, అరగల లక్ష్మీనారాయణ, గల్లా రమణమ్మ, అరగల ఆదిలక్ష్మమ్మ, కాకి శారదమ్మ, గల్లా జయశ్రీ, భారతి, దాసరి పేరమ్మ, నెల్లూరు మమత, విడవలూరు లలిత, బుక్కి తులసమ్మ, జి.రమణమ్మ, తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. కుటుంబాలకు కుటుంబాలు చంద్రబాబుని, తనను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని క్రిష్ణారెడ్డి హామీనిచ్చారు. అందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని తెలిపారు. కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌ఛార్జి శ్రీనివాసులు, నెల్లూరు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి పెనుబాపల వెంకటేశ్వర్లు, వాయిల తిరుపతి, కాటంగారి వెంకట్రావు, అరగల జాలయ్య, కాకి మురళి, అరగల సుధ, నెల్లూరు రాజేష్‌, అరగల రవి, అరగల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

➡️