టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి నియోజకవర్గంలో టిడిపిలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం నూనె నారాయణ యాదవ్‌ ఆధ్వర్యంలో కనిగిరి నియోజకవర్గానికి చెందిన 30 మంది యువత వైసీపీని వీడి టిడిపి కనిగిరి నియోజకవర్గం ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వెనుకబడిన కనిగిరి అభివృద్ధి చెందాలంటే టిడిపి విజయం సాధించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయానికి కృషి చేయాలని సూచించారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

➡️