టిడిపిలో టికెట్ల వేట

టిడిపిలో టికెట్ల పోరు పతాకస్థాయికి చేరుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ ఆశావహుల్లో అలజడి నెలకొంది. టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు జనసేన, బిజెపి పొత్తుల్లో తలమునకలైన నేపథ్యంలో ఎవరి టికెట్‌కు ఎసరు వస్తుందోనని, ఎవరికి ఎగనామం పెరుకుతారోననే తెలియని గందరగోళ వాతావరణం నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఇందులోభాగంగా టిడిపి నేతల్లో కొందరు భారీ డిన్నర్లు, మరొకరు తనకే టికెట్‌ వచ్చిందని, మరొకరు గుంభనంగా ప్రచారం నిర్వహిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. మరి కొన్ని అసెంబ్లీల్లో టికెట్లు ప్రకటించక మునుపే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండడం వంటి వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది.ప్రజాశక్తి – కడప ప్రతినిధి ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయం రసవత్తంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ఎన్నికల షెడ్యూలు నేడో, రేపో విడుదల చేయనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహణకు, అసంతృప్తులను బుజ్జగించడానికి సమయం తక్కువగా ఉండే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్‌, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు టికెట్ల కోసం సిగ పట్లు పట్టడం ఆసక్తిని కలిగిస్తోంది. రసవత్తరంగా రాయచోటి రాజకీయం రాయచోటి నేతలు వ్యూహాత్మక ఎత్తుగడల్లో నిమగమయ్యారు. మాజీ ఎమ్మెల్యే ద్వారక నాధరెడ్డి భారీ డిన్నర్‌ నిర్వహించడం ద్వారా టిడిపి కార్య కర్తలను సమీపించుకోవడం, అసంతృప్తులను బుజ్జగించడం వంటి ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. ఇదేతరుణంలో మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అధిష్టానం నుంచి తనకే టికెట్‌ లభించిందని సమాచారం ఉందనే ప్రచారంతో కేడర్‌ సంబరాలు చేసు ుంటున్న వైనం ఆసక్తిని కలిగిస్తోంది. ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే ఆర్‌. రమేష్‌రెడ్డి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న వాతావరణం నెలకొంది. రాజంపేటలో ఇన్‌ఛార్జి, సీనియర్‌ నాయకులు బత్యాల చెంగల్రాయుడు, ఇటీవలే తెరపైకి వచ్చిన పారిశ్రామికవేత్త ఘంటా నరహరి, విద్యావేత్త జగన్మోహన్‌రాజు మధ్య టికెట్‌ పోటీ నెలకొంది. ముగ్గురు ఆశావహు లు నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి కేడర్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. కడపలో టిడిపి నేతల్లో గందరగోళం నెలకొంది. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుని సతీమణి ఆర్‌. మాధవీరెడ్డి టికెట్‌పై భరోసాతో నియోజకవర్గవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ప్రత్యర్థులైన సీనియర్‌ నాయకులు అలంఖాన్‌పల్లి లకీëరెడ్డి, అమీర్‌బాబు సైతం తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, డిప్యూటీ సిఎం అంజాద్‌బాషాపై హాట్‌ కామెంట్లతో రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేయడం తెలిసిందే. కమలాపురం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డికి టికెట్‌ స్పష్టత లేకపోవడంతో నిరీక్షిస్తుండడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఇటీవల పార్టీలో చేరి టికెట్‌ ఆశిస్తుండడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ప్రొద్దుటూరు బరిలో నలుగురు ఆశావహులతో హైటెన్షన్‌ రాజకీయం నడుస్తోంది. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌, శ్రీనివాసులరెడ్డి భరోసాతో యువ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రధాన ఆశావహునిగా మారడం ప్రత్యర్థుల్లో గుబులు రేగుతోంది. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి టికెట్‌ తనదేనని, పార్టీ కోసం రూ.300 కోట్లు మేర నష్టపోయాయని పేర్కొనడం ద్వారా ప్రధాన పోటీదారునిగా మారడం గమనార్హం. ఈయనతోపాటు సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి టికెట్‌ ఇస్తే పోటీ చేస్తాననే ధోరణి వ్యక్తం చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ముగ్గురికితోడు నేను సైతం అంటూ సి.ఎం సురేష్‌ సైతం టికెట్‌ ఆశా వహుల్లో ఒకరుగా ఉండడం ఎనలేని ఆసక్తిని కలిగిస్తోంది. జమ్మలమడుగులో టిడిపి టికెట్‌ ప్రధాన ఆశావహునిగా భూపేష్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. యువ కుడు, సౌమ్యునిగా ముద్రపడడంతో ఆశావహ వాతావరణం ఏర్పడింది. ఇంతలో జనసేన, బిజెపి పొత్తు నేపథ్యంలో మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. టిడిపి అభ్యర్థుల్లో గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఊహాగానాలను వదలడం చికాకు పరుస్తోంది. ఇటు వంటి తరహా వాతావరణం రాజంపేటలోనూ నెలకొంది. ఇక్కడ టిడిపి గట్టి అభ్యర్థిని నిలిపితే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. ఇటువంటి చోట జనసేన, బిజెపికి ఇస్తే టిడిపి ఖాతా తెరడం కష్టమేననే వాదన వినిపిస్తోంది. ఏదే మైనా జనసేన, బిజెపి అలయెన్స్‌ కారణంగా టిడి పి, మిత్రులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయనే వాదన విశ్లేషకుల నుంచి వినిపి స్తోంది.

➡️