టిడిపిలో భారీగా చేరికలు

Dec 28,2023 21:11

 ప్రజాశక్తి-విజయనగరంకోట  :   విజయనగరం నియోజకవర్గానికి చెందిన పలువురు టిడిపిలో చేరారు. గురువారం అశోక్‌ బంగ్లా టిడిపి కార్యాలయంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు, జిల్లా బిసి సంఘం అధ్యక్షులు గదుల వెంకటరావు ఆధ్వర్యంలో 300కుటుంబాలు, 26వ డివిజన్‌ నాయకులు ముక్కాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 50కుటుంబాలు, కార్యకర్తలతో పాటుగా, విజయనగరం నియోజకవర్గ బిసి సంఘ నాయకులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు వీరికి పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు, నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి అతిథి గజపతిరాజు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. టిడిపి అధికారంలోకి వచ్చాక బిసిల కోసం ప్రత్యేక చట్టాలు చేస్తుందని తెలిపారు.

➡️