టిడిపి కార్యకర్త కుటుంబానికి ఎంఎల్‌ఎ కోటంరెడ్డి ఆర్థిక సాయం

Jan 30,2024 21:24
బాధిత కుటుంబంతో మాట్లాడుతున్న రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి

బాధిత కుటుంబంతో మాట్లాడుతున్న రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి
టిడిపి కార్యకర్త కుటుంబానికి ఎంఎల్‌ఎ కోటంరెడ్డి ఆర్థిక సాయం
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:నెల్లూరు నగరంలో జరిగిన ‘రా కదలిరా’ బహిరంగ సభకు హాజరై తిరుగు ప్రయాణంలో నెల్లూరు దొడ్ల డైరీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాత వెల్లంటికి చెందిన జువ్వల శీనయ్య మతి చెందడంతో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మంగళవారం బాధిత కుటుంబం వద్దకు వెళ్లి ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తన వంతు తక్షణ సహాయంగా 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు.బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మతుడు జువ్వల నరసయ్య కుమారుడు జువ్వల చందు ఉన్నత చదువు చదివే వరకు పూర్తిస్థాయిలో సహాయం చేస్తామన్నారు. గాయాలు పాలైన ఇద్దరికి రూ.50వేలు చొప్పున, మరో ఆరుగురికి పదివేల లెక్కన ఆర్థిక సహాయం ప్రకటించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య, టిడిపి మీడియా కోఆర్డినేటర్‌ జలదంకి సుధాకర్‌, యువనేత దాట్ల చక్రవర్ధన్‌ రెడ్డి పలువురు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️