టిడిపి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ప్రజాశక్తి – ముద్దనూరు రాష్ట్ర సంక్షేమం కోసం టిడిపి అమలు చేసే మేనిఫెస్టోను ప్రతిరోజూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని జమ్మలమడుగు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి కోరారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మంగళవారం భూపేష్‌ ఆధ్వర్యంలో ముద్దనూరు, కొండాపురం, ఎర్రగుంట్ల మండలాల క్లస్టర్‌ యూనిట్‌ బూత్‌ ఇన్‌ఛార్జిలకు ఇంటింటికి శంఖారావంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ బాబుష్యూరిటీ.. భవిష్యత్‌ గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి కార్యకర్త టిడిపి గెలుపునకు కృషి చేయాలన్నారు. అనంతరం టిడిపి ఇంటింటికి శంఖారావం కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, మండల అధ్యక్షులు శివరామిరెడ్డి, పట్టణ అధ్యక్షులు రంగారెడ్డి, టిడిపి నాయకులు రాజశేఖర్‌ యాదవ్‌, సత్తార్‌, సాయి, రామ కృష్ణారెడ్డి, చిన్న మాబు, బాబా అమీర్‌ పాల్గొన్నారు.ప్రతి బూత్‌లో మెజారిటీ మన లక్ష్యంజమ్మలమడుగు రూరల్‌ : జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ టిడిప,ి జనసేన మెజారిటీ ఓట్లే మన లక్ష్యమని టిడిపి ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జిలతో శంఖారావం డోర్‌ టు డోర్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ మహానాడులో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మినీ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగేలా ఆరు పథకాలను పొందుపరిచారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, జనసేన జమ్మలమడుగు కో-ఆర్డినేటర్‌ నల్లంసెట్టి నాగార్జున, టిడిపి, జనసేన, నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.పేదల అభ్యున్నతికి టిడిపి కృషి : బిటెక్‌ రవి వేంపల్లె : బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న పార్టీ తెలుగుదేశమేనని పులివెందుల టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లెలోని బిడ్డాలమిట్ట ప్రాంతంలో మైనార్టీ కన్వీనర్‌ తెలంగాణ వలి, అబ్దుల్‌ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రవి, ఆయన సతీమణి లతారెడ్డి ఇంటింటికి తిరిగి టిడిపి సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. సైకిల్‌ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. వైసిపి నుండి టిడిపిలో చేరిన మాజీ ఎంపిటిసి ఫాతిమా కుటుంబ సభ్యులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి మండల పరిశీలకుడు రఘునాథ్‌రెడ్డి, జనసేనా పులివెందుల ఇన్‌ఛార్జి హరిష్‌, మండల కన్వీనర్‌ రామమునిరెడ్డి, మైనార్టీ కన్వీనర్‌ తెలంగాణ వలి, నిమ్మకాయల మహమ్మద్‌ దర్బార్‌, ఎస్పీ జయ చంద్రారెడ్డి, డివి సుబ్బారెడ్డి, అబ్దుల్‌, మహమ్మద్‌ ఇనాయతుల్లా, పీరా సాహె బ్‌, జబిబుల్లా, మడక శ్రీనివాసులు, వేమకుమార్‌, డక్కా రమేష్‌, పాపిరెడ్డి, గొటూరు నాగభూషణం, కత్తులూరు నాగసుబ్బయ్య, కత్తులూరు మల్లి కార్జున, ఈశ్వరయ్య, రామాంజనేయురెడ్డి (చంటి), రామగంగిరెడ్డి, వెల్డింగ్‌ బాషా, గోగుల మల్లికార్జున, మేస్త్రీ రమణ, రెడ్డి కిషోర్‌, నాయకులు పాల్గొన్నారు.

➡️