టిడిపి విజయం తథ్యం : నారాయణ

Dec 13,2023 19:18
మాట్లాడుతున్న నారాయణ

మాట్లాడుతున్న నారాయణ
టిడిపి విజయం తథ్యం : నారాయణ
ప్రజాశక్తి – నెల్లూరు సిటీవచ్చే ఎన్నికల్లో టిడిపి విజయమే నినాదంగా… ప్రతి అడుగు ప్రజల వైపు పయనించాలని మాజీమంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు నారాయణ మెడికల్‌ కాలేజి క్యాంపు కార్యాలయంలో బుధవారం నెల్లూరు పార్లమెంట్‌ టిడిపి అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌తో కలిసి ఆయన నగర నియోజకవర్గ పరిధిలోని 28 డివిజన్ల వైస్‌ ప్రసిడెంట్లతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా బాబు షఉ్యరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ, మినీ మ్యానిఫెస్టో, సూపర్‌ సిక్స్‌ పథకాలను వారికి క్షుణ్ణంగా వివరించారు. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి దిశానిర్ధేశం చేశారు. నగర నియోజకవర్గ పరిధిలోని 28 డివిజన్లలో ఎక్కడ ఏ సమస్య ఉన్న టీడీపీ ఆధ్వర్యంలో అక్కడికక్కడే పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. టిడిపి ముఖ్య నేతలు నాయకులు పాల్గొన్నారు.

➡️