టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు మారినట్టే

Dec 20,2023 21:30
మాట్లాడుతున్న నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌

మాట్లాడుతున్న నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌
టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు మారినట్టే
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:టీడీపీ అధికారంలోకి వస్తే మన బిడ్డల భవిష్యత్తు మారినట్లేనని అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్‌ కాలేజీలో బుధవారం నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కలిసి 3,4,6,8,9,10 డివిజన్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ, గత ఎన్నికలకు నేటి ఎన్నికలకు భూమి ఆకాశానికి ఉన్న తేడా ఉందన్నారు. నేటి ఎన్నికలు పూర్తిగా కార్పొరేట్‌ ఎన్నికలు అయిపోయాయన్నారు. మన కర్మలను బట్టే ఫలితాలు ఉంటాయని మనం చేసే పనులను బట్టే మన భవిష్యత్తు మారబోతోందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కషి చేయాలని సూచించారు.

➡️