టెక్నికల్‌ సింపోజియం విద్యార్థులకు ఉపయోగం

ప్రజాశక్తి-మదనపల్లి అంగళ్లు సమీపంలోని మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సైబర్‌ సెక్యూరిటీ) విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో టెక్నికల్‌ సింపోజియంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగుళూరుకు చెందిన జెపి మోర్గాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సయెద్‌ షాహిద్‌ మునీర్‌పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని సూచించారు. కంప్యూటర్‌ , ఐటిలో దినదినాభివృద్ధి చెందుతుందని, విద్యార్థులకు ఉద్యోగవకాశాలు మెరుగ్గా ఉన్నా యన్నారు. సైబర్‌ సెక్యూరిటీలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మనం అందరం ముక్యంగా ఎదురుకుంటున్న సమస్య సైబర్‌ నేరగాళ్లు వేర్వేరు విధానాల్లో ప్రజల దగ్గర నుంచి డబ్బులు కాజేస్తున్నారని, దీనికి మనం ఎంత జాగ్రత్తగా ఉన్న సైబర్‌ నేరగాళ్లు వేర్వేరు విధానాల్లో మోసం చేస్తూనే ఉన్నారన్నారు. ఇది ఒక్క రోజులో పరిష్కారమయ్యే సమస్య కాదని పేర్కొన్నారు. విద్యార్థులు మరింత ఆలోచనలతో నూతన పరిశోధనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామనాథన్‌, విభాగాధిపతి డాక్టర్‌ గంగాదేవి పాల్గొన్నారు.

➡️