టెన్త్‌ విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ

Feb 27,2024 20:54

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : రాజాం మండలం లోని కంచరాం, డోలపేట , పొగిరి గ్రామాలలోని జెడ్‌పి హైస్కూళ్లలో టెన్త్‌ విద్యార్థులకు జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్‌ అధ్యక్షురాలు సిరి సహస్ర మంగళవారం స్టేషనరీ పంపిణీ చేసారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్త్రం లో విద్యాభివృద్ధి కోసం జగనన్న ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాథశాలల రూపు రేఖలు మార్చారన్నారు. విద్యార్ధులు క్రమ శిక్షణతో చదువుకుంటే మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు.

➡️