టేఖరుకండిని సందర్శించిన ఆర్‌పి సిసోడియా

Feb 10,2024 21:45

ప్రజాశక్తి – కురుపాం : మండలం లోని కురుపాం పంచా యతీ పరిధిలో గల టేఖరుకండి గిరిజన గ్రామాన్ని ఎంసిహెచ్‌ ఆర్‌డి డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌పి సిసోడియ శనివారం సందర్శిం చారు. ఈ సందర్భంగా తాను పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు పిఒగా ఉన్నప్పుడు గిరిజన రైతులకు ఇచ్చిన జీడి తోటలను పరిశీలించి రైతులతో జీడి పంట లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన రైతులు ఆయనతో మాట్లాడుతూ జీడిపంట అయితే బాగానే వస్తుంది కానీ ఇక్కడ ప్రాసెసింగ్‌ యూనిట్‌ లేకపోవడంతో పలాస తీసుకు వెళ్లలేక ఇక్కడ వ్యాపారులకు అమ్మడంతో గిట్టుబాటు ధర రావడంలేదని తెలిపారు. కావున ఈ ప్రాంతంలో జీడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రకృతి వ్యవసాయానికి వాడుతున్న ఘన ద్రవ జీవపదార్థాలను పరిశీలించారు. డిపిఎం షణ్ముఖరాజును ప్రకతి వ్యవసాయ పద్ధతులు, ఉపయోగిస్తున్న సేంద్రియ ఎరువులు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జట్టు సంస్థ వ్యవస్థాపకులు డి.పారి నాయుడు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, గిరిజన రైతులు పాల్గొన్నారు.తోటపల్లి దేవస్థానం సందర్శనగరుగుబిల్లి : మండలంలోని తోటపల్లి దేవస్థానాన్ని సిసోడియా సందర్శించారు. ఆయనకు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.వి.సూర్యనారాయణ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మర్రాపు సత్యనారాయణ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం, అనంతరం వారికి స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గౌరీశంకర్‌ పాత్రో, తోటపల్లి దేవాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️