ట్రాఫిక్‌ సిఐగా శోభన్‌ బాబు బాధ్యతలు స్వీకరణ

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న శోభన్‌ బాబు

పల్నాడు జిల్లా: ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా నరసరావుపేట ట్రాఫిక్‌ సిఐగా బాధ్య తలు స్వీకరించిన యు. శోభన్‌ బాబు గురువారం పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవి శంకర్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. శోభన్‌ బాబు గతంలో పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణ సిఐ కూడా విధులు నిర్వహించారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలను నివారిం చాలని, ట్రాఫిక్‌ వ్యవస్థ ను మార్చడానికి పాటుపడాలని ఎస్పీ సూచించారని శోభన్‌ బాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని విధిగా వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్స్‌, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్‌, కారు నడిపే వారు సీటు బెల్ట్‌ పెట్టుకుని ప్రమాదాల నివారణకు కషి చేయాలన్నారు. వాహనాలను ఎక్కడబడితే అక్కడ నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఉండేం దుకు ఎల్లప్పుడు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎస్పీ సూచించారు.ప్రతి ఒక్కరికి ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన ఉండేలా సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

➡️