డంపింగ్‌ యార్డులుగా గ్రామ చెరువులు

Dec 13,2023 00:13
చేసే విధంగా చర్యలు

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

డంపింగ్‌ యార్డులుగా గ్రామాల్లో ఉన్న చెరువులను తయారు చేస్తున్నారు గ్రామాల్లో తొలగించిన పారిశుధ్యాన్ని చెరువుల్లో వేయడంతో చెరువులు మూసుకుపోతున్నాయి దీంతో చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న వారికి దుర్వాసన వెదజల్లడంతో నానా ఇబ్బందులకూ గురవుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో చెరువులు మూసుకుపోతున్నాయి. గ్రామాల్లో ఉన్న చెరువులను అభివృద్ధి చేయాలని కోర్టు ఆదేశాలు ఉన్నా కోర్టు నిబంధనలను గాలికి వదిలేయడంతో కొత్తపల్లి, ఉప్పాడ తదితర గ్రామాల్లో ఉన్న చెరువులు డంపింగ్‌ యార్డ్లులుగా మారిపోతున్నాయి. ఉప్పాడ రింగ్‌ రోడ్డు సమీపంలో ఉన్న చెరువును డంపింగ్‌ యార్డ్‌గా మార్చేశారు. ఉప్పాడ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి చెత్త అంతా తెచ్చి ఆ చెరువులో వేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న చెరువులను అభివృద్ధి చేసేందుకు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకన్నాయి. కానీ కొన్ని గ్రామాల్లో స్థానిక నాయకులు, అధికారులు నిర్లక్ష్యం వల్ల చెరువుల అభివృద్ధి అనేది పక్కకుపోయి ఉన్న చెరువులను చెత్తతో నింపేస్తున్నారు. గతంలో చెరువుల వద్దకు వచ్చి పాడి పశువులు సేద తీరేవి. కానీ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో చెరువులు డంపింగ్‌ యార్డ్‌లుగా మారిపోతుండటంతో పశువులను ఎక్కడకు తీసుకెళ్లాలో తెలియడం లేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు. కోర్టు నిబంధనలు గాలికి వదిలేయకుండా గ్రామాల్లో ఉన్న చెరువులను అభివద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️