డాక్టర్‌ గురుబ్రహ్మంకు అంతిమ వీడ్కోలు

ప్రజాశక్తి -కనిగిరి : కనిగిరి పట్టణానికి చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ చప్పరపు గురుబ్రహ్మం అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, టిడిపి నాయకులు, వైసిపి ఇన్‌ఛార్జి దద్దాల నారాయణ యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, వైస్‌ చైర్మన్‌ పులి శాంతి గోవర్ధన్‌ రెడ్డి, వైసిపి నాయకులు, సిపిఎం నాయ కులు పిసి.కేశవరావు, పివి.శేషయ్య, పిల్లి తిప్పారెడ్డి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌కె. ఖాదర్‌ వలీ, ప్రసాద్‌, డివైఎఫ్‌ఐ నాయకుడు నరేంద్ర, ఐద్వా నాయకురాలు ఎస్‌కె. బషీరా తదితరులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. డాక్టర్‌ గురుహ్మ్రంకు నివాళుర్పించిన వారిలో ప్రజాసంఘాల నాయకులు, వైద్యులు, ఆర్యవైశ్య నాయకులు, వ్యాపారులు ఉన్నారు.

➡️