తక్షణమే పంట నష్టపరిహారమివ్వండి

 తాడేపల్లి: రైతు సంఘం తాడేపల్లి డివిజన్‌ కమిటీ సమావేశం శుక్రవారం తాడేపల్లిలో జరిగింది. ఈ సమావేశానికి మోదుగుల శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పంట పొలాలకు ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్లను బిగించడం ఎత్తేయాలని, రైతులకు రుణమాఫీ చేయా లని, పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం అందజేయాలన్నారు. అలాగే, పంటల బీమా పథకం అమలు చేయాలని, రబీలో సీజనల్‌ విత్త నాలు ఉచితంగా అందించాలని, ఉండవల్లి పంపింగ్‌ స్కీంకు విద్యుత్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు దొంతిరెడ్డి వెంకట రెడ్డి , కాజా వెంకటేశ్వరరావు, బి. శివారెడ్డి, వీరాస్వామి, ఎస్‌కె మీర్‌సాహెబ్‌, టి. బక్కిరెడ్డి, పి.లక్ష్మణరావ, లకీëనారా యణ తదితరులు పాల్గొన్నారు.

➡️