తాండవపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

తాండవపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

ప్రజాశకి-కోటనందూరుకోటనందూరులో తాండవ నదిపై రూ.10 కోట్లతో హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి శుక్రవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా శంకుస్థాపన చేశారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి మరమ్మతులకు గురై, ఎత్తు తగ్గిపోవడంతో అధిక వర్షాల సమయాల్లో బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తోంది. దీనితో కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు చెందిన 44 గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎంపిపి లగుడు శ్రీనివాస్‌, తుని మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ వెలగా వెంకటకృష్ణాజీ స్థానిక సర్పంచ్‌ గరిసింగు శివలక్ష్మి దొరబాబు మంత్రి రాజా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. 7/8 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలో వెయ్యలేని ప్రధాన రహదారులకు అన్నింటికీ సిసి రోడ్లు, తారు రోడ్లు రూ.కోట్లాది నిధులతో నిర్మించినట్టు చెప్పారు. నదీ ప్రవాహాలపై, జగన్నాధపురంలో చెరువు గట్టు పైన, తాటిపాక ఎస్‌ఆర్‌.పేట గ్రామాల మధ్య పంట కాలువపై బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టామన్నారు. సిఎం వైఎస్‌.జగన్‌ చేస్తున్న అభివృద్ధిని చేసి, మంచి చేస్తేనే ఓటేయండని మంత్రి రాజా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో లాలం బాబ్జి, గొర్ల రామచంద్రరావు, నల్లమిల్లి గోవిందు, కొరుప్రోలు కృష్ణ, బంటుపల్లి గంగాధర్‌, లంక ప్రసాద్‌, సుర్ల రాజు, లంక ప్రసాద్‌, బంటుపల్లి వెంకటేశ్వరరావు, జగటాల వీరబాబు, జగటాల కోట సత్తిబాబు, దొడ్డు బాబ్జి, మల్లంపల్లి ప్రకాష్‌ పాల్గొన్నారు.

➡️