‘తాంతియా’ ను కలిసిన భవాని

ప్రజాశక్తి -కనిగిరి : కనిగిరికి చెందిన కదిరి భవాని ఇటీవల రాష్ట్ర మహిళ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తాంతియా కుమారిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి కలిసి శాలువాతో సత్కరించారు. బొకే అందజేసి ధన్యవాదములు తెలిపారు. అనంతరం ప్రముఖ సినీ హీరో రాజాను కలిశారు. ఈ సందర్భంగా రాజా భవానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ తన సేవలను గుర్తించి మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలిగా పదవి వచ్చే విధంగా కషి చేసిన తాంతియా కుమారి , పిసిసి అధ్యక్షురాలు షర్మిల , ఇడబ్ల్యుసి మెంబర్‌ గిడుగు రుద్రరాజు, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలి, జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి ్ల ప్రసాద్‌, మార్కాపురం ఇన్‌ఛార్జి, రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి సైదాకు ధన్యవాదాలు తెలిపారు.

➡️