తుపాను బాధిత ప్రాంతాల్లో కేంద్రబృందం పర్యటన

Dec 14,2023 21:02
కేంద్ర బృందానికి తుపాను నష్టాన్ని వివరిస్తున్న

తుపాను బాధిత ప్రాంతాల్లో కేంద్రబృందం పర్యటనప్రజాశక్తి – తడ ఈనెల మొదటివారంలో వచ్చిన తుపాను నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. మండలంలోని కాదలూరు, కోండూరు గ్రామాల్లో పర్యటించారు. కాదలూరు చెరువుకు పడిన గండిని, పులివేంద్ర గ్రామం వద్ద ఇసుక మేటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర కరువు బృందం సభ్యులు మీనాహుడా, రాజేష్‌కుమార్‌ మాట్లాడుతూ గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం, విద్యుత్‌ మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టాన్ని అంచనా వేశామన్నారు. పూర్తి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కేంద్రకమిటీ సభ్యులు విపత్తుల వల్ల కలిగిన నష్టాన్ని అవగాహన చేసుకుని నివేదిక అందజేయాలని, ఎక్కువ నిధులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వీరివెంట సూళ్లూరుపేట ఆర్డీవో చంద్రముని, వ్యవసాయ శాఖ డిఎఒ ప్రసాద్‌, తడ తహశీల్దార్‌ కటారి జయజయరావు, ఎడిఎ అనిత ఉన్నారు. కేంద్ర బృందానికి తుపాను నష్టాన్ని వివరిస్తున్న ఆర్డీవో కిరణ్‌కుమార్‌

➡️