తుపాన్‌ బాధితులకు పరిహారం అందజేయాలి

Dec 13,2023 19:11
నిరసన ర్యాలీ చేపట్టిన నాయకులు

నిరసన ర్యాలీ చేపట్టిన నాయకులు
తుపాన్‌ బాధితులకు పరిహారం అందజేయాలి
ప్రజాశక్తి -నెల్లూరు
నగర నియోజకవర్గ పరిధిలో తుపాన్‌ బాధితులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బాధితులు గాంధీ బొమ్మ సెంటర్‌ నుంచి కలెక్టర్‌ ఆఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తుపాన్‌ కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. ఇళ్లలోకి నీరు చేరి వస్తువులు, దుస్తులు, సరుకులు తడిసిపోయాయన్నారు. నిరాశ్రయులుగా మిగిలారన్నారు. ఒకరోజు భోజనాలు ఏర్పాటు చేసి అధికారుల చేతులు దులిపేసుకున్నారన్నారు. నేటికీ బాధితులకు సాయం అందలేదన్నారు.కొంతమందికి కేవలం 2500 ఇచ్చి అదే సాయంగా చెబుతున్నారన్నారు. బాధితులందరికీ 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు తక్షణమే అందించాలని డిమాండ్‌ చేశారు. నీట మునిగిన ఇళ్లకు 5 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 10వేలు, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు 25 వేల ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నగరంలో అన్ని రోడ్లు ధ్వంసం అయ్యాయని యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.అనంతరం జిల్లా రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు ఆర్‌ శ్రీనివాసులు, ఐద్వా నగర కార్యదర్శి కత్తి పద్మ, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి బీపీ నరసింహ, నగర నాయకులు మూలం ప్రసాద్‌, అల్లంపాటి శ్రీనివాస రెడ్డి,అత్తిమూరి శ్రీనివాసులు,ఆర్‌ నగేష్‌,శివకుమారి, సంపూర్ణమ్మ,నారాయణ, ఫయాజ్‌,రఫీ, ఏమేలు ఉన్నారు.

➡️