తృటిలో తప్పిన ప్రమాదం

Dec 3,2023 23:21
ట్రాఫిక్‌ రాకపోకలకు తీవ్ర

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్‌

సామర్లకోట-జి.రాగంపేట రోడ్లో జగనన్న కాలనీ సమీపాన సిఎం జగన్మోహన్‌ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన భారీ ఇనుప హోర్టింగ్‌ ఆదివారం మధ్యాహ్నం వీచిన తీవ్ర గాలులకు ఒక్కసారిగా కుప్ప కూలి పోయింది. అదే సమయంలో వాహనాలు రాకపోకలు మనుషుల సంచారం లేకపోవ డంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. హోర్డింగ్‌ కూలి సమయానికి రెండు నిమిషాల ముందే కాకినాడ వెళుతున్న ఆర్‌టిసి బస్సు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గత నెలలో సిఎం జగన్‌ పర్యటన సందర్భంగా జగనన్న కాలనీ వద్ద ఈ భారీ ఇనుప హోర్డిం గ్‌ను ఏర్పాటు చేశారు. రోజులు గడుస్తున్న అధికారులు తొలగించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్‌ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫ్లెక్సీలను స్థానికులు పక్కకు తొలగించారు.

➡️