త్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌గా చంద్రశేఖర్‌

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌

నూజివీడు ట్రిపుల్‌ ఐటి నూతన డైరెక్టర్‌గా ఆచార్య ఎ.చంద్రశేఖర్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం చంద్రశేఖర్‌ను డైరెక్టర్‌గా నియమించింది. వరంగల్‌ నిట్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా, సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతిగా, రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ను అధ్యాపకులు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

➡️