త్వరలో ‘అనకాపల్లి’ పేరుతో సినిమా

నక్కిన త్రినాధరావు

సినీ దర్శకులు నక్కిన త్రినాధరావు వెల్లడి

ప్రజాశక్తి- అనకాపల్లి: తన సొంత నిర్మాణ సంస్ధ నక్కిన నేరేటివ్స్‌ బ్యానర్‌పై ‘అనకాపల్లి’ పేరుతో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సినీ దర్శకులు నక్కిన త్రినాధరావు ప్రకటించారు. ఆదివారంగౌరీ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనకాపల్లిలోనే నటీనటుల ఎంపిక (అడిషన్స్‌), చిత్రీకరణ జరుగుతుందన్నారు.తన సినీ జీవిత ప్రస్ధానానికి బీజం వేసింది శ్రీగౌరీ గ్రంథాలయంలోనేనని, సినిమాలకు సంబంధించిన పుస్తకాలను ఇదే గ్రంధాలయంలోనే చదువుకున్నానన్నారు. సినీ పరిశ్రమలో ఎంతటివారికైనా గ్యారెంటీ సున్నాయేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలు, వృత్తినైపుణ్య శిక్షణ కార్యక్రమాలు గ్రంథాలయంలో నిర్వహించడం ద్వారా ఎందరికో ఉద్యోగ, ఉపాధికి దోహదపడడం అభినందనీయమన్నారు. విద్యార్ధుల ఆలోచనలు, పాఠకులు మనోగతానికి అనుగుణంగా ఆధునాతన సాంతికేక పరిజ్ఞానంతో గౌరీ గ్రంథాలయాన్ని అప్‌టూ డేట్‌ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ, జగన్నాథస్వామి ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్‌ దాడి ఈశ్వరరావు, సినీ నటుడు బాలాజీ బద్రీనాధ్‌, సభ్యులు కాండ్రేగుల సత్యనారాయణ (ఎస్‌ఎఫ్‌ఐ), బొడ్డేడ జగ్గఅప్పారావు, కాండ్రేగుల సురేష్‌, శీలా జగన్నాధరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్కిన త్రినాధరావును గ్రంథాలయ కమిటీ ఘనంగా సత్కరించింది.

మాట్లాడుతున్న సినీ దర్శకులు నక్కిన త్రినాధరావు

➡️