దక్షిణ మండల టెన్నిస్‌ పోటీలకు గీతం జట్టు

 ప్రజాశక్తి-మధురవాడ : అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఎఐయు) ఆధ్వర్యాన ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల విశ్వవిద్యాలయాల పురుషుల (సౌత్‌జోన్‌) టెన్నిస్‌ పోటీలకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేసినట్లు క్రీడా విభాగం డైరక్టర్‌ డాక్టర్‌ యు.విజయకుమార్‌ తెలిపారు. జట్టు మేనేజర్‌గా గీతం క్రీడా విభాగం డిప్యూటీ డైరక్టర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. గీతం జట్టుకు కెప్టెన్‌గా వి.గౌతమ్‌ వ్యవహరిస్తారని, సభ్యులుగా పిబి.శ్రీకార్తిక్‌, ఎన్‌.కుసాల్‌వర్మ, కె.శ్రీరంగరిషిత్‌, కె.నాగసాయి వెంకట రోహిత్‌ ఎంపికయ్యారని తెలిపారు. 27వ తేదీన మొదటి పోటీ హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం జట్టుతో గీతం జట్టు తలపడనుందని పేర్కొన్నారు.

➡️