దాడి ఘటనలో ఏడుగురు నిందితుల అరెస్ట్‌

వివరాలు వెల్లడిస్తున్న డిఎస్‌పి సుబ్బరాజు

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట

వడ్డాది సినిమా ధియేటర్‌ వద్ద ఈనెల 16న బుర్ర దుర్గతేజపై దాడి చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనకాపల్లి డిఎస్‌పి సుబ్బరాజు తెలిపారు. గురువారం బుచ్చయ్యపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి భూపతి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు, దర్యాప్తు అనంతరం నిందితులపై ఐపిసి 307 హత్యాయత్నం, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు ఎ.శ్రీరామ్‌, కొరసాల గణేష్‌, వెలుగుల సాయికుమార్‌, మాకాల త్రినాథ్‌, గండం ప్రసాద్‌, వెలుగుల సురేంద్రలను కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. గ్రామంలో వివాదాలకు ఆస్కారం లేకుండా ఇరువర్గాలతో శాంతికమిటీల ఏర్పాటుతోపాటు పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. కొత్తకోట సిఐ అప్పలనాయుడు, బుచ్చయ్యపేట ఎస్‌ఐ డి ఈశ్వరరావు ఉన్నారు.

➡️