దాతల భాగస్వామ్యం అభినందనీయం

జిల్లా శాంతి రథాల విభాగం ఛైర్మన్‌ రాంబాబు

ప్రజాశక్తి – భీమడోలు

స్వచ్ఛంద సంస్థ మానవత భీమడోలు శాఖ చేపడుతున్న సాంఘిక, సేవా కార్యక్రమాల్లో దాతలు భాగస్వాములు కావటం అభినందనీయమని సంస్థ జిల్లా శాంతి రథాల విభాగం ఛైర్మన్‌ అప్పక రాంబాబు అన్నారు. భీమడోలుకు చెందిన దాతలు గుళ్ల ఆదిలక్ష్మి, గుళ్లకృష్ణ చైతన్య తమ పూర్వీకులు గుళ్ల అప్పల స్వామి, అచ్చాయమ్మ దంపతుల సంస్మరణార్థం రూ.75 వేల విలువ గల శవాలను భద్రపరిచే ఫ్రీజర్ను భీమడోలు మానవత శాఖకు సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అందజేశారు. దీనిని సంస్థ జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పక రాంబాబు, రామిశెట్టి గంగాధర రావు చేతుల మీదుగా శాఖ ఛైర్మన్‌ గుళ్ల నూకరాజు, ఇతర సభ్యులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మానవత ద్వారా రాష్ట్ర పరిధిలోని 110 మండలాల్లో సేవా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు.

➡️