దుర్గా ఐవిఎఫ్‌ సెంటర్‌ అరుదైన ఘనత

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ఇన్‌విట్రో ఫెర్టిలిటీ(ఐవిఎఫ్‌) ద్వారా సంతాన ఉత్పత్తిలో దుర్గా ఐవిఎఫ్‌ సెంటర్‌ 65 శాతం సక్సెస్‌ రేటు సాధించిందని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువని సెంటర్‌ నిర్వాహకులు డాక్టర్‌ జె శైలజ, డాక్టర్‌ ప్రత్యూష, డాక్టర్‌ సుస్మిత తెలిపారు. దుర్గ ఐవిఎఫ్‌ సెంటర్‌లో ఐవిఎఫ్‌ ద్వారా సంతానం పొందిన దంపతులతో గెట్‌ టుగెదర్‌ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతానం కలిగిన దంపతులు వారి అనుభవాలను వివరించారు. అనంతరం డాక్టర్‌ జె శైలజ, డాక్టర్‌ ప్రత్యూష, డాక్టర్‌ సుస్మిత మాట్లాడుతూ దుర్గా ఐవిఎఫ్‌ సెంటర్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా వైద్యం చేయడంతో విజయం సాధిస్తున్నట్లు తెలిపారు. దుర్గా టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఏర్పాటు చేసి 9 ఏళ్లు అయిందన్నారు. 63 శాతం సక్సెస్‌ రేటు సాధించామని, ఐవిఎఫ్‌ ద్వారా సంతానం ఆధునిక వైద్య పరికరాలు, పద్ధతుల ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఐవిఎఫ్‌ ద్వారా ఇప్పటి వరకూ 300 మందికి పైగా కాన్పులు చేసినట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో దుర్గా ఐవిఎఫ్‌ సెంటర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️