దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి

మొలలోతులో నీరు నిల్వ ఉన్న వరి పంటను పరిశీలిస్తున్న పీలా తదితరులు

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం

మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో వీచిన గాలులు, ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో దెబ్బతిన్న పంటలను టిడిపి, జనసేన, సిపిఐ నాయకులు గురువారం పరిశీలించారు. పంటలను నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు.కశింకోట : దెబ్బతిన్న వరికి ఎకరాకు 30వేలు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మండలంలోని ఏనుగు తుని, జే.తుని, ఏన్‌జీ పాలెం గ్రామాల్లో నీట మునిగిన వరి పంటలను గురువారం ఆయన పరిశీలించారు. జగన్‌ రెడ్డికి రైతుల కష్టాలు కనిపించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. బాధిత రైతులను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గొంతుని శ్రీనివాసరావు, ఉగ్గిన రమణ మూర్తి, కాయల మురళి , నయనం శెట్టి రమణారావు, ఉల్లింగల రమేష్‌, మజ్జి నిరంజన్‌ కుమార్‌, ఎంపీటీసీ షేక్‌ దర్గా, ఎలమంచిలి వెంకట రావు, అందే సన్యాసిరావు, కాపుశెట్టి శివ పాల్గొన్నారు.చీడికాడ : తుఫాను తీవ్రత మూలంగా మాడుగుల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్ట పోయారని, వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పైలా ప్రసాదరావు డిమాండ్‌ చేశారు. చీడికాడ మండల టీడీపీ నేతలతో కలిసి వరహాపురం తదితర నష్ట ప్రభావ ప్రాంతాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పేరపు కొండబాబు, రెడ్డి సన్యాసినాయుడు, రెడ్డి రాము, ధర్మిశెట్టి వరహాలనాయుడు, తాటికొండ దేముడునాయుడు, చెట్టుపల్లి సర్పంచ్‌ గొర్లె గణేష్‌, పాతాళం మహేష్‌, పాతాళం నాగసత్యనారాయణ పాల్గొన్నారు.అనకాపల్లి : మండలంలోని వెంకుపాలెం, కుంచంగి, తగరంపూడి, సీతానగరం గ్రామాల్లో వందల ఎకరాల్లో నీట మునిగిన పంటలను టిడిపి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గురువారం పరిశీలించారు. పంటలు మునిగి రైతులు లబోదిబోమంటున్నా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ రైతులను పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. మండలంలోని రేబాక ప్రాంతంలో పంట పొలాలను జనసేన నాయకులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రైతులను అప్రమత్తం చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టడంలోనూ, నష్టపోయిన పంటలను గుర్తించడంలోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు దూలం గోపి,తాడి రామకృష్ణ, మల్ల శ్రీను, కరణం నాయుడు, బర్నికాన రాము, అప్పికొండ గణేష్‌, వర్మ పాల్గొన్నారు.మండలంలోని తుమ్మపాల, బవులువాడ గ్రామాల్లో తుపాను కారణంగా నష్టపోయిన పంటలను సీపీఐ జిల్లా బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ అప్పులు చేసి పెట్టి బడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నరాలశెట్టి సత్యనారాయణ, కోరిబిల్లి శంకర్రావు, వియ్యాపు రాజు, పప్పల ఈశ్వరరావు, వియ్యపు రమణ, ఎం తాతారావు పాల్గొన్నారు.కె.కోటపాడు : మండలంలోని అనేక పల్లపు గ్రామాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగి ఉందని, వారందరికీ పంట నష్టాన్ని ప్రభుత్వం అందజేయాలని సిపిఐ మండల కార్యదర్శి గొర్లే దేవుడు బాబు డిమాండ్‌ చేశారు. గురువారం సిపిఐ బృందం కింతాడ, సింగన్నదొరపాలెం, దాలివలస, గవరపాలెం గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. నర్సీపట్నం టౌన్‌ : తుపానుతో తక్షణమే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకట రమణ డిమాండ్‌ చేశారు. గొలుగొండ, నాతవరం, నర్సీపట్నం మండలాల్లో కల్లాలలో తడిసిన ఆరబెట్టిన ధాన్యాన్ని, పొలాల్లో నీటిలో మునిగిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ, నష్టపోయిన ఆహారపు పంటలకు ఎకరానికి 40000, వాణిజ్య పంటలకు 75 వేలు చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ పర్యటనలో సిపిఐ నాయకులు పొట్టిక సత్యనారాయణ, మాకిరెడ్డి రామునాయుడు గొల్లు గురుబాబు, శివలంక కొండలరావు, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

➡️