దేదీప్యమానంగా దీపోత్సవం

అనంత పద్మనాభస్వామి దీపోత్సవం

మిరిమిట్లు గొలిపేలా వెలిగిపోయిన అనంత పద్మనాభుడు

వేలాదిగా తరలివచ్చి దర్శించుకున్న భక్తులు..

అధికారుల పటిష్ట ఏర్పాట్లతో వేడుక విజయవంతం

ప్రజాశక్తి – పద్మనాభం : మండలకేంద్రంలోని అనంత పద్మనాభస్వామి అఖండ కోటి దీపోత్సవం మంగళవారం దేదీప్యమానంగా జరిగింది. మిరిమెట్టు గొలిపే దీపాల వెలుగులో అనంత పద్మనాభుడు, కుంతీమాధవస్వామి ఆలయాలతోపాటు పద్మనాభుని కొండ వెలిగిపోయింది. ఏటా కార్తీక అమావాస్య రోజున ఆనవాయితీగా నిర్వహించే అనంత పద్మనాభుని దీపోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం నుంచే ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ ప్రధానార్చకులు సీతారామాంజనేయులు బృందం ఆధ్వర్యంలో అధికసంఖ్యలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంతీమాధవస్వామి అలయంలో కొలువుదీరిన శ్రీదేవిభూదేవికి సమేతుడైన అనంత పద్మనాభస్వామి ఉత్సవ విగ్రహలను మేళతాళ ధ్వనులు, చిడతలు, తప్పెటగుళ్లు, వేదమంత్రోచ్ఛారణ మధ్య పల్లకీలో ఊరేగించి, కొండ తొలిపావంచా వద్ద ప్రతిష్టించారు. సాయంత్రం ఐదున్నర గంటలకు జేగంట మోగిన వెంటనే అప్పటికే ఆలయ కమిటీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులు అన్ని మెట్లుపై ఏర్పాటు చేసిన దీపాలను ఒకేసారి వెలిగించడం ద్వారా అనంతపద్మనాభుని దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. దీపాల వెలుగులో ఆలయాలు, పరిసరాలతోపాటు కొండిపాంతమంతా దేదీప్యమానంగా వెలుగొందింది. కాగా అనంతపద్మనాభుని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుజాత, ఎంపిపి కె రాంబాబు, జెడ్‌పిటిసి సుంకర గిరిబాబు, వైసిపి మండల అధ్యక్షుడు కె లక్ష్మణరావు, సర్పంచ్‌ తాలాడ పాప, ఎంపిటిసి ి కె లక్ష్మి.దర్శించుకున్నారు.పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికారులు అనంతపద్మనాభుని దీపోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ ఇఒ నానాజీబాబు ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.ఘాట్‌రోడ్డును చదును చేసి భక్తుల రాకపోకలకు వీలుగా చర్యలు చేపట్టారు. కొండపైకి వాహనాలను నిషేధించారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ అప్పలరాజు ఆధ్వర్యంలో పార్కింగ్‌, వాహన రాకపోకలను నియంత్రించే చర్యలు చేపట్టారు. బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను మళ్లించడం ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.కొండ నుంచి పద్మనాభం జంక్షన్‌ వరకు అటు గోస్తనీ వంతెన వరకు రోడ్డుకు ఇరువైపులా దీపాలను ఏర్పాటు చేయడంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా పోయింది. కొండపై ఏర్పాటు చేసిన బారికేడ్లు ద్వారా క్రమబద్దంగా పద్మనాభుని దర్మన ఏర్పాట్లు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించి, వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. అధికారుల పకడ్బందీ ఏర్పాట్లుతో అనంతపద్మనాభుని దీపోత్సవం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. శివన్నారాయణ కొండపై దీపోత్సవంమండలంలోని అనంతవరం గ్రామంలో శివన్నారాయణ కొండపై గొర్రిపాటి పెద్దనాయుడు దంపతులు, భక్తులు సహకారంతో దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్తీక అమావాస్యను పురస్కరించుకుని ఏటా ఆనవాయితీగా వేడుక నిర్వహిస్తున్నారు. కొండపైకి ఉన్న మెట్లకు ఇరువైపులా భక్తులు వెలిగించిన దీపాల వెలుగులో శివన్మారాయణ కొండ కాంతులీనింది. ఈ సందర్భంగా అనంతవరం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ వరకు భóక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సౌకర్యం కల్పించారు.కార్యక్రమంలో పెంట పేకేరు, అనంతవరం, కొవ్వాడ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

➡️