దేశం గర్వించదగ్గ వ్యక్తి వాజ్‌పేయి : మాజీ మంత్రి కామినేని

ప్రజాశక్తి – ముదినేపల్లి

మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి దేశం గర్వించదగ్గ అత్యుత్తమ వ్యక్తి అని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ముదినేపల్లిలోని గురజ రోడ్‌ సెంటర్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా దిమ్మను మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేశ ప్రధానిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా వాజ్‌పేయి దేశానికి ఎన్నో సేవలు అందించారన్నారు. నేడు దేశంలో నిర్మితం అవుతున్న హైవేలు రూపకల్పన వాజ్‌పేయి చేశారని గుర్తు చేశారు. వాజ్‌పేయి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండల అధ్యక్షులు సత్యవోలు నాగలక్ష్మి, పైడిపాటి శివశంకర్‌, వైవాక మాజీ సర్పంచి లక్ష్మీపతి రాజు, జిల్లా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు రెడ్డి రాధిక పాల్గొన్నారు.

➡️