దొంగ పట్టాలు సృష్టిస్తున్న వారిని అరెస్టు చేయాలి

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌)అమృత్‌నగర్‌ స్థలాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, పేదలకు ఇస్తున్న స్థలాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు చేపట్టిన రిలే దీక్షలు శని వారానికి 29వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను ఉద్దేశించి సిపిఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ 2008లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా స్థలాలు ఇచ్చారని, అక్కడ మౌలిక వసతులు కల్పిం చడంలో అధికారులు, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఘోరంగా విఫల మయ్యా రన్నారు. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి బేస్‌ మట్టాలు వేసు కున్నారు. కొందరు ఇళ్లను నిర్మించుకున్నారు. అవి కూడా శిథిలావస్థకు చేరు కున్నాయి. పెట్టిన ఖర్చు వృథాగా అయిపోయిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారన్నారు. అమృత్‌నగర్‌లో కొంతమంది తహశీల్దార్‌ రాజముద్ర కలిగిన సీలు తయారు చేసుకొని దొంగ పట్టాలు తయారు చేస్తూ టీంలుగా ఏర్పడి పేదవారిని బెదిరిస్తూ కోట్ల రూపాయలు స్థలాలు అమ్ముకుంటూ గడి స్తున్నా రన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పం పాలన్నారు. వీరిపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ సహక రిస్తున్నారన్నారు. ఆందోళనలో లత, రమీజా, హరి, నరసింహ, మధు, వెంక టేష్‌, హసీనా, పుష్పలత, మల్లికా, భాను, కిరణ్‌ బాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్‌ బేగం, రాములమ్మ, హుస్సేన్‌బాషా, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️