ద్వారకాతిరుమలలో సినీ సందడి

ద్వారకాతిరుమల : ఫోర్‌ కె ఫిలిం ఫ్యాక్టరీ ద్వారా నూతన చిత్రాన్ని ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శుక్రవారం ప్రారంభించినట్లు నిర్మాత పవన్‌ కుమార్‌ తెలిపారు. ద్వారకాతిరుమలలోని పివిఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నిర్మాత విలేకరులతో మాట్లాడారు. సందీప్‌ అద్వైత్‌ హీరోగా, కావేరి హీరోయిన్‌గా ‘గ్రామ ప్రజలకు విజ్ఞప్తి’ అనే సినిమాను ప్రారంభించినట్లు తెలిపారు. సాయి విజరు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారన్నారు. ఈ నూతన చిత్రానికి మంజులూరు జానకి క్లాప్‌ కొట్టారు. ద్వారకాతిరుమల చిన్న వెంకన్నపై ఉన్న అపార భక్తితో ఆయన కొలువైయున్న గ్రామంలో చిత్రీకరణ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తరగళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️