ధాన్యం కొనుగోలుపై దృష్టిపెట్టాలిప్రజాశక్తి-వీరఘట్టంధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై రైతులు ఎటువంటి ఇబ్బందులూ కలగనివ్వొద్దన్నారు. ఇటీవల కాలంలో తుపాను ప్రభావం వల్ల ధాన్యం రంగు మారే పరిస్థితి ఉందని, వాటిని కూడా కొనుగోలు చేసేందుకు చొరవ చూపాలని కోరారు. రైతులు మోసపోకుండా ఉండేందుకు దళారుల నుండి విముక్తి కల్పించాలని అధికారులకు సూచించారు. ఎంత విస్తీర్ణంలో పంట నాశనమైందో వివరాలు నమోదు చేయాలన్నారు. అనంతరం నర్సిపురం పంచాయతీ సర్పంచ్‌ కర్రి గోవిందరావు మాట్లాడుతూ గ్రామానికి జలజీవన్‌ మిషన్‌ పనులు చేయడం లేదని ప్రశ్నించారు. మూడో విడతలో చేపడతామని ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇ పవన్‌ వివరణ ఇచ్చారు. విద్యుత్తు శాఖ ఎఇ బాలాజీ మాట్లాడుతుండగా, వీరఘట్టం-4 ఎంపిటిసి మంతిని హేమలత అడ్డుతగిలి, గత మండల సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించిన సమస్యలు పరిష్కారం కాలేదని, ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. సమస్య పరిష్కరిస్తామని ఎఇ తెలిపారు. ఎంపిడిఒ వై.వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్‌పిటిసి జంపు కన్నతల్లి ఉమామహేశ్వరరావు, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ కర్రి లీలాప్రసాద్‌, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

Dec 10,2023 21:38

  ప్రజాశక్తి-వీరఘట్టం  :  ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై రైతులు ఎటువంటి ఇబ్బందులూ కలగనివ్వొద్దన్నారు. ఇటీవల కాలంలో తుపాను ప్రభావం వల్ల ధాన్యం రంగు మారే పరిస్థితి ఉందని, వాటిని కూడా కొనుగోలు చేసేందుకు చొరవ చూపాలని కోరారు. రైతులు మోసపోకుండా ఉండేందుకు దళారుల నుండి విముక్తి కల్పించాలని అధికారులకు సూచించారు. ఎంత విస్తీర్ణంలో పంట నాశనమైందో వివరాలు నమోదు చేయాలన్నారు. అనంతరం నర్సిపురం పంచాయతీ సర్పంచ్‌ కర్రి గోవిందరావు మాట్లాడుతూ గ్రామానికి జలజీవన్‌ మిషన్‌ పనులు చేయడం లేదని ప్రశ్నించారు. మూడో విడతలో చేపడతామని ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇ పవన్‌ వివరణ ఇచ్చారు. విద్యుత్తు శాఖ ఎఇ బాలాజీ మాట్లాడుతుండగా, వీరఘట్టం-4 ఎంపిటిసి మంతిని హేమలత అడ్డుతగిలి, గత మండల సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించిన సమస్యలు పరిష్కారం కాలేదని, ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. సమస్య పరిష్కరిస్తామని ఎఇ తెలిపారు. ఎంపిడిఒ వై.వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్‌పిటిసి జంపు కన్నతల్లి ఉమామహేశ్వరరావు, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ కర్రి లీలాప్రసాద్‌, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

➡️