నర్తన శాల విద్యార్థులకు రికార్డ్స్‌ బుక్‌లో స్థానం

Jan 19,2024 19:27

 ప్రజాశకి-విజయనగరం టౌన్‌  : ఇటీవల అంతర్జాతీయ కర్ణాటక సంగీత నృత్య అకాడమీ నిర్వహించిన నృత్య పోటీలలో విజయనగరానికి చెందిన నర్తనశాల విద్యార్థులు పాల్గొని రికార్డ్స్‌ బుక్‌లో స్థానం సంపాదించారని అకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.రాధికారాణి పేర్కొన్నారు. శుక్రవారం ఎస్‌విఎన్‌ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నర్తనశాల అకాడమీ గౌరవ అధ్యక్షులు ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రాజు, అష్టలక్ష్మి ఆలయం ధర్మకర్త ఉమా బాలాజీ, ఎస్‌విఎన్‌ హోటల్‌ ఎమ్‌డి శివకుమార్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో నర్తనశాల అకాడమీ ఉపాధ్యక్షులు టిఎల్‌ఎన్‌ మూర్తి, కార్యదర్శి సూర్యలక్ష్మి విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️