నలుపు దుస్తులు ధరించి కార్మికులు నిరసన

Dec 30,2023 21:08

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : మున్సిపల్‌ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఐదో రోజు సమ్మెలో భాగంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద గల సమ్మె శిబిరంలో పారిశుధ్య కార్మికులు నలుపు రంగు దుస్తులు ధరించి విన్నూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఆప్కాస్‌ విధాన కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని, ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ అందరికీ హెల్త్‌ అలవెన్స్‌ రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, సిఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా పారిశుధ్య కార్మికుల సంఘం అధ్యక్షులు నాగవంశం శంకర్రావు, పట్టణ అధ్యక్షులు చీపురుపల్లి సింహాచలం, పడాల గాంధీ, మామిడి శివ, బంగారు రాజేష్‌, గుంట్రెడ్డి గంగయ్యలు, ఇప్పలమ్మ, పాపులమ్మ, పడాల సంతు, వెంకన్న, సాయి, రవి, సత్తిరాజు, కార్మికులు పాల్గొన్నారు.సమ్మెకు టిడిపి కౌన్సిలర్లు మద్దతుమున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద చేస్తున్న సమ్మె శిబిరానికి టిడిపి కౌన్సిలర్లు ద్వారపురెడ్డి శ్రీదేవి, బడే గౌరునాయుడు, టి. వెంకట్రావు, కోలా సరిత వెళ్లి మద్దతు తెలిపారు.సాలూరు : పట్టణంలో మున్సిపల్‌ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ పట్టణ అధ్యక్షులు శంకర్‌, రాముడు మాట్లాడారు. మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం గ్రాడ్యుటీ, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన జీతం ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు రవి, శ్రీను, పోలిరాజు, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

➡️