నల్ల రిబ్బన్లతో అంగన్వాడీల నిరసన

Dec 1,2023 20:13

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ లు అమలు చేయాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నల్ల రిబ్బన్లతో కార్యకర్తలు, ఆయాలు విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం తాము చేస్తున్న దశల వారి పోరాటాన్ని గుర్తించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్‌ 8 నుంచి నిరవధిక సమ్మె తప్పదని ఆమె హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️