నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Dec 7,2023 22:09
ఈ పర్యటనలో టిడిపి

ప్రజాశక్తి – సీతానగరం

తుపాన్‌ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని మాజీ మంత్రి, టిడిపి రాజమహేం ద్రవరం పార్లమెంటు అధ్యక్షుడు కెఎస్‌ జవహార్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం కోరుకొండ గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను రాజానగరం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జవహార్‌ మాట్లాడుతూ తుపాన్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. రైతులకు జరిగిన నష్టానికి, ప్రజల కష్టాల పాలు కావడానికి సిఎం జగన్‌ రెడ్డి నిద్రావస్థే కారణమని ధ్వజమెత్తారు. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌ సహా ఇతర వనరుల దోపిడీ కోసం చేస్తున్న ముందస్తు పథక రచనలో సగం కూడా తుపాన్‌ బాధితులను కపాడేందుకు దృష్టి పెడితే ఇంతటి నష్టం జరిగేది కాదనానరు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 10 శాతం వరిపైరు మాత్రమే రైతుల చేతికి అందిందని, మిగిలిందంతా నీళ్లపాలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరితోపాటు మిర్చి, పత్తి, పొగాకు పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయని అన్నారు. కళ్ల ముందే కష్టపడి పండించిన పంట నీళ్లపాలై కుమిలిపోతున్న రైతుకు కావాల్సింది కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళా దుంప గడ్డలు, వెయ్యి, రెండు వేల ఆర్థికసాయం కాదని, ప్రజలు కోరుకునేది ఏమిటో తెలుసుకోవాలంటే జగన్‌ రెడ్డి నీటమునిగిన పంటపొలాలు పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తిరుపతి, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని, రాష్ట్రంలో ఇంత నష్టం జరగడానికి కారణం ముమ్మాటికీ సిఎం జగన్‌ రెడ్డేనని విమర్శంచారు. ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని, ఆర్‌బికెలు, అధికార యంత్రాంగం రైతుల్ని చైతన్యవంతులను చేయడంలో విఫలం అయ్యిందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో వచ్చిన తుపాన్లు, విపత్తులు వల్ల జరిగిన నష్టం కళ్లముందు కనిపిస్తున్నా జగన్‌ రెడ్డి మిచౌంగ్‌ తుపాన్‌ను ఎదుర్కోవడానికి ఎలాంటి ముందుస్తు చర్యలు చేపట్టలేదన్నారు. ఈ పర్యటనలో టిడిపి నాయకులు తనకాల నాగేశ్వరరావు, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️