నాయకులకు సూచనలు

Mar 17,2024 21:44
ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
నాయకులకు సూచనలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, పంచాయతీల్లో, గ్రామాల్లో, మున్సిపల్‌ వార్డుల్లో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి నియోజకవర్గ నాయకులకు సూచనలు అందజేశారు. నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆదివారం రానున్న ఎన్నికలకు సంబధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు బైబై బాబు అంటూ నినాదాన్ని బలంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు లైవ్‌ టైమ్‌ డిస్‌ ప్లే బోర్డును ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు పొత్తులతో వస్తున్న పార్టీలను ఎదుర్కొవడానికి 2024 ఎన్నికలల్లో మరోసారి సిద్ధం అంటూనే లిజగన్‌ అనే నేనులి సిద్ధం అంటూ డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చేయనున్నామని, రానున్న ఎన్నికలకు కేడర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ నియోజకవర్గంలో మనం చేయబోయే అభివృద్ధిని వివరించాలని సూచించారు. ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, మనం గ్రామాల్లో చేసిన, చేయబోయే అభివృద్ధి పనులను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కొద్ది రోజుల్లో వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉందని, గతంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ఏ విధంగా నూటికి 99శాతం అమలు చేశారో, అదే విధంగా ఈ దఫా కూడా తప్పకుండా పూర్తిగా అమలు చేస్తారన్న విషయం ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని, నామినేషన్లకు చివరి తేది ఏప్రిల్‌ 25 వరకు ఉంటుందని, మే 13న ఎన్నికలు జరుగుతాయని, ఆత్మకూరు నియోజకవర్గంలోని 278 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి అందరిని సంసిద్ధం చేసేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ, ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి, జెసిఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సి.హెచ్‌ ఆదిశేషయ్య, రూరల్‌ మండల కన్వీనర్‌ జితేంద్ర నాగ్‌రెడ్డి, జెడ్‌పిటిసి పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, ఐవి రమణారెడ్డి, నోటి వినరుకుమార్‌ రెడ్డి, కౌన్సిలర్‌ పొడమేకల పెంచలయ్య, సర్పంచి ప్రసాద్‌ రెడ్డి తదితరులున్నారు.

➡️