నార్కో అనాలసిస్‌కు సిద్ధమా? : బిటెక్‌ రవి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి నార్కో అనాల సిస్‌కు సిద్దమా అని టిడిపి పులి వెందుల నియోజకవర్గ అభ్యర్థి బిటెక్‌ రవి సవాల్‌ విసిరారు. సోమవారం టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి స్వగ హంలో విలేకరుల సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో పులివెందులలో ఎవరిని అడిగినా చెప్తారని తెలిపారు. ఎన్నికల ముందు తన సవాల్‌ను స్వీకరించాలని చెప్పారు. వైఎస్‌ సునీత తండ్రి హత్య కేసులో న్యాయం చేయాలని అన్న జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిస్తే, అవినాష్‌ రెడ్డి బిజెపిలోకి వెళతారని చెప్పిన మాట వాస్తవమా కాదా బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పాలన్నారు. గొడ్డలితో చంపారు అని జగనుకు ఎవరు చెప్పారో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. గొడ్డలి కొనుగోలుకు దస్తగిరికి డబ్బులు ఫోన్‌ పే చేసింది ఎవరో సిబిఐ దగ్గర రికార్డు సిద్ధంగా ఉందని తెలిపారు. హత్యకు గురైన వ్యక్తి లెటర్‌ ఎలా రాస్తారని జగన్‌ చెప్పిన విషయం అందరికీ విధితమే అన్నారు. చంద్రబాబు హయాంలో ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్న నాయకులు, జగన్మోహన్‌ రెడ్డి హయాంలో ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారో చెప్పాలన్నారు. సునీత ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రజల మద్దతు కావాలని కోరారని చెప్పారు. దీంతో వైసీపీ నాయకుల్లో గుబులు పుట్టిందని పేర్కొన్నారు. ఎక్కడ ఎంపీగా పోటీ చేస్తుందో అన్న భయం వీరిలో మొదలైందని పేర్కొన్నారు. కుటుంబాలను విడదీస్తున్నారన్న వైసిపి నాయకుల మాటలకు అర్దం లేదన్నారు. కేశినేని నాని, కేశినేని చిన్నాను విడదీసింది ఎవరని ప్రశ్నించారు. సింహం సింగిల్‌ గా వస్తుందని చెప్పుకునే వీరు సతీష్‌ రెడ్డిని వైసిపిలోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. అప్రూవర్స్‌ అన్ని స్పష్టంగా చెబుతూ ఉన్నారని తెలిపారు. వాస్తవాలు త్వరలో బయటికి వస్తాయని పేర్కొన్నారు. దేవి రెడ్డి శంకర్‌ రెడ్డి కొడుకు దస్తగిరి ఉన్న జైలులోకి వెళ్లి మెడికల్‌ క్యాంపు పెట్టడమేమిటిని ప్రశ్నించారు. టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేసారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నా ఇంతవరకు ప్రెస్‌ మీట్‌ పెట్టి తనకు సంబంధం లేదని ఎందుకు చెప్పలేకున్నారని ప్రశ్నించారు. అవినాష్‌ రెడ్డిపై సిబిఐ కేసు పెట్టి ఉందని, ముద్దాయిగా ఉన్నాడని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అవినాష్‌ రెడ్డి కి, జగన్మోహన్‌ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

➡️