నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి

Jan 30,2024 00:17

ప్రజాశక్తి – తాడికొండ : బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సిఐ ప్రభాకర్‌రావు వివరాలు ప్రకారం.. మండలంలోని రావెలకు చెందిన బాలిక ఆదివారం తమ ఇంటి ఎదుట ఆడుకుంటుండగా సమీపంలో ఉన్న 18 ఏళ్ల నక్కా గోపి అనే యువకుడు బాలికకు మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి నుండి బయటకు వచ్చి వాంతులు చేసుకుంటుండగా గమనించిన తల్లి.. బాలికను అడిగి విషయం తెలుసుకుని నిందితుడు గోపిని నిలదీసింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితుడు ఆమెను దూషిస్తూ రాళ్ల దాడికి దిగాడు. దీంతో బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)కు పంపించారు. నిందితుని కోసం గ్రామంలో గాలింపు చేపట్టిన పోలీసులకు చిక్కకుండా పొలాల్లోకి పరుగులు తీసి దాక్కున్నాడు. అయితే సోమవారం నాటికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైదనిందితుడు గోపిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు.

➡️