నిధులు ఇవ్వలేని సమావేశాలు ఎందుకు?

-మండల సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించిన సర్పంచ్‌లుప్రజాశక్తి-నిమ్మనపల్లె గ్రామాల అభివద్ధికి నిధులు ఇవ్వలేని సమావేశాలు మాకెందు కంటూ సర్పంచ్‌లు వెళ్లిపోయిన సంఘటన నిమ్మనపల్లి సర్వసభ్య సమా వేశంలో బుధవారం జరిగింది. బుధవారం స్థానిక మండల ప్రజాపరిషత్‌ సమావేశ భవనంలో ఎంపిపి నరసింహులు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపిడిఒ షాలెట్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపి టిసిలు ఆలస్యంగా రాగా, హాజరు రిజిష్టర్‌లో కోరంకు అవసరమైన ఐదు మంది ఎంపిటిసి సభ్యులు సంతకాలు చేశారు. వైస్‌ ఎంపిపి జయప్రకాశ్‌ రెడ్డి, ముష్టూరు ఎంపిటిసి వెంకటరమణ, సర్పంచ్‌లు, ప్రభుత్వ అధికారులు మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు. ఎంపిడిఒ షాలెట్‌, తహశీల్దార్‌ బాలాజీ రాజు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నియమనిబంధనలు అమల్లో ఉన్నందున, అజెండా చర్చించడానికి వీల్లేదని, ప్రజలకు అత్యవసరమైన పనులకు సంబంధించి మాత్రమే చర్చ జరగాలని సూచించారు. ఇంతలో రాచవేటివారిపల్లె సర్పంచ్‌ సుబ్రమణ్యం(మధు), సామకోటవారిపల్లె సర్పంచ్‌ మహాదేవరెడ్డిలు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా మండల పరిషత్‌ నుంచి పంచాయతీలకు ఎటువంటి నిధులు ఇవ్వలేదని, ఏ మేరకు నిధులు ఇచ్చారో వివరాలు చెప్పాలని నిలదీశారు. తమ పంచాయతీల అబి óవద్ధికి నిధులు ఇవ్వని మండల పరిషత్‌ సమావేశాలకు మేమెందుకు హాజరు కావాలని ప్రశ్నించారు. తమ గ్రామాల అభివద్ధిని పట్టించుకోని కార ణంగా మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెబుతూ సమా వేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రభుత్వ అధికారులు నచ్చజెప్పడానికి ప్రయ త్నించారు. అనంతరం ఎంపిపి నరసింహులు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన వెంటనే గ్రామాల్లో గుర్తించిన సమ స్యలను పరిష్కరించడానికి, ప్రజలకు అవసరమైన పనులను చేపట్టడానికి ప్రతి గ్రామానికి ప్రభుత్వం ద్వారా రూ.20 లక్షల చొప్పున నిధులు ఇచ్చా మన్నారు. ప్రతి ఎంపిటిసికి మండల పరిషత్‌ నిధుల నుంచి మరో రూ.4 లక్షల చొప్పున అభివద్ధి పనులకు నిధులను కేటాయించినట్లు చెప్పారు. ముఖ్యంగా వేసవికాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు అవసరమైన చర్యలను చేపట్టాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు బోర్లు, మోటర్లు, పైప్‌ లైన్‌, మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి జయప్రకాశ్‌ రెడ్డి, సర్పంచ్‌లు వరలక్ష్మి, సుబ్రమణ్యం, మహాదేవరెడ్డి, కే.రెడ్డప్ప, సింగల్‌విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్‌రెడ్డి, ఆర్‌బికె చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, ఆర్‌ఐ రమణారెడ్డి, ఇఒపిఆర్‌డి చలపతిరావు, ఉద్యానవన శాఖాధికారి ఈశ్వర్‌ ప్రసాద్‌రెడ్డి, మత్స్య శాఖాధికారి సుబ్బనరసయ్య, ఎఇలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️