నిబద్ధత కలిగిన వ్యక్తి సుభాని

ప్రజాశక్తి-మార్కాపురం : నిజాయతీ, నిబద్ధత కలిగిన వ్యక్తిగా హెడ్‌ పోస్ట్‌ మాస్టర్‌ సయ్యద్‌ సుభాని పేరు గడించారని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కొనియాడారు. తపాలా శాఖలో నాలుగు దశాబ్ధాలుగా ప్రజలకు సేవలందించిన సుభానీ ఉద్యోగ విరమణ పోస్టల్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాంబాబు మాట్లాడుతూ సుభానీ తనకు చిన్ననాటి స్నేహితుడన్నారు. సేవా భావం కలిగిన వ్యక్తి సుభానీ అన్నారు. అనంతరం సుభానీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎఐపిఇయు రాష్ట్ర సహాయ కార్యదర్శి నూనె రమణారెడ్డి, బీసీ బ్రిలియంట్‌ కమ్యూనిటీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పిఎల్‌పి యాదవ్‌, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, ఎఐపిఇయు సర్కిల్‌ కార్యదర్శి శ్రీధర్‌బాబు, పోస్టల్‌ విశ్రాంత ఏడీ పి.సిద్ధయ్య, విశ్రాంత డిప్యూటీ డిఇఒ సిహెచ్‌పి వెంకటరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు ఇ.రంగస్వామిగౌడ్‌, ఎస్‌పిఒ కె.శ్రీనివాసులు, విశ్రాంత ఎస్‌పిఒ పివిఎల్‌.ప్రసాద్‌, రాష్ట్ర ఎఐపిఇయు మాజీ సిఎస్‌.డిఎఎస్‌వి ప్రసాద్‌, ఎన్‌జిఒ యూనిట్‌ సెక్రటరీ వడ్లమాని శ్రీనివాస్‌, ఎపియుడబ్ల్యుజె కౌన్సిల్‌ సభ్యులు ఎన్‌వి. రమణ, మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఎం.సిరాజ్‌భేగ్‌ పాల్గొన్నారు.

➡️